Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovanu Sthuthinchuta Manchidi Mahonathuda

యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా

Yehovanu Sthuthinchuta Manchidi Mahonathuda

Verse
యెహోవాను స్తుతించుట మంచిది మహోన్నతుడా
నీ నామమును సంకీర్తనము చేయుట మంచిది
Verse
ఉదయము నందు నీదు కృపను
ప్రతిరాత్రిలో నీ - విశ్వాస్యతను
యెహోవా నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది
Verse
పదితంతులు గల - స్వరమండలమున్
గంభీర ధ్వనిగల - సితారలను
వాయించి నిన్ను గూర్చి - ప్రచురించుట మంచిది
Verse
ఎందుకనగా యెహోవా - నీ కార్యము చేత
నీవు నన్ను సంతోష-పరచు చున్నావు
నీ చేతిపనులను బట్టి - నేనుత్సహించుచున్నాను
Verse
యెహోవా నీ కార్యము - లెంత మంచివి
నీ యాలోచన లతి - గంభీరములు
పశుప్రాయులు అవి-వేకులు వివేచింపరు
Verse
నిత్యనాశనము - నొందుటకే గదా
భక్తిహీనులు గడ్డి - వలె చిగుర్చుదురు
చెడు కార్యములను - చేయువారు పుష్పింతురు
Verse
మహోన్నతుడవుగా - నిత్యముండు యెహోవా
నీ శత్రువు లెహోవా - నశియించెదరు
చెడు పనులను చేయు - వారందరు - చెడిపోదురు
Verse
నీతిమంతులు తమా-ల వృక్షమువలె
నాటబడినవారై - యెహోవా మందిరములో
ఎదుగుచు మొవ్వు వేసి - వర్థిల్లుచు నుండెదరు
Verse
నాకు ఆశ్రయమైన - యెహోవా యథార్థుడు
చెడుగు లేనివాడని - ప్రసిద్ధి చేయుటకు
సారము కలిగి ప-చ్చగ నుందురు వృద్ధులు

Related Tags

PraiseWorshipPsalm