Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaye Aascharya Karyamulanu Chesiyunnadu

యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు

Yehovaye Aascharya Karyamulanu Chesiyunnadu

Chorus
యెహోవాయే ఆశ్చర్య కార్యములను చేసియున్నాడు
మేలుతో నీహృదయమును - తృప్తిపరచుచున్నాడు
Verse
దేవా నీదు కృపతో - నన్ను కరుణింపుము
నీ వాత్సల్యతతో నా - గత పతనంబుల క్షమియించు
Verse
ఆకాశమున నుండి కలిగిన - దర్శనమునకు
నే నవిధేయుడను కాను - నా దేవా జూపుము కృపను
Verse
బాధించు శత్రువు నన్ను - బలముగ బాధించినను
నే ధైర్యము విడువను - నను బలపరచుము నీలోన
Verse
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నేనుండెద నిలలో
పావనమగు నీ యాత్మన్ - ప్రాపుగ నొసగుము నీదయతో
Verse
ప్రభుయేసు నామమిలలో - ప్రాకటముగ నే బ్రకటింతు
ప్రత్యక్షముగ నీ శక్తిన్ - ప్రసాదించుము నాకిలలో
Verse
నీయందు నేను నిలిచి - నిత్యము నే ఫలియింతున్
సత్యాత్ముడా నాకిమ్ము - నిత్యముగను నీ జీవం
Verse
ఆత్మాగ్ని చేత దేవా - అజ్ఞానుండగు నను నింపు
నీ జ్ఞానము నాకిమ్ము - సుజ్ఞానుండా హల్లెలూయా

Related Tags

PraiseWorshipGrace