Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yehovaye Manadevudu Marpulenivadu

యెహోవాయే మనదేవుడు మార్పులేనివాడు

Yehovaye Manadevudu Marpulenivadu

Chorus
యెహోవాయే మనదేవుడు - మార్పులేనివాడు‖ 2x ‖
నిన్న నేడు నిరంతరము - ఒకే రీతిగా ఉన్నాడు‖ 2x ‖
Verse
పాపశాపముల బాప - మానవ రూపి ఆయెను
అద్భుత ప్రేమ జూపి - మనలను తానె రక్షించెను
Verse
తన రెక్కలతో కప్పి - ఆశ్రయమిచ్చును ఆయనె
స్వరక్త మిచ్చి కొన్న - తన సంఘమును కాయును
Verse
క్రుంగిన వేళలందు - అభయమునిచ్చె దేవుడు
తన హస్తముతో నిలిపి - అంతమువరకు ఆదుకొనున్
Verse
శాశ్వత ప్రేమ జూపి - శ్రమలలో విజయ మిచ్చును
విశ్వమంతయు మారిన - ఎన్నడుమారడు మనయేసు
Verse
సంఘముగా చేరి - యెహోవాకే మొర్ర పెట్టెదము
ఆపత్కాలము నందు - ఉత్తరమిచ్చును ఆయనె

Related Tags

PraiseWorshipFaithfulness