Verse
ఏలో ఏలో ఏలో అంటూ వచ్చారండీ గొల్లలు
సంతోషాలే పొంగేనండీ - హైలెస్సా
దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు ఆడే
సంగీతాలే పాడాలండీ - హైలెస్సా
అంధకారాన్ని తొలగించే మహనీయుడు
పుట్టినాడండీ యేసయ్య మనదేవుడు
నిన్నే కోరి నిన్నే చేరి
ఇట్టా రక్షించ వచ్చాడు పరమాత్ముడు
Verse
లోకాలనేలేటి రారాజురా - ఉదయించె సూరీడై వచ్చాడురా
ఆకాశ వీధి - మెరిసేటి దారి - ఒకతార మురిసిందిగా‖ 2x ‖
దూతాళి పాడి - కొలిచారు చూడు
ఘనమైన ఒక వేడుక
ఆ గొల్లలేగా - దరువేసే చూడు
మెస్సయ్య - పుట్టాడనీ
మన మెస్సయ్య - పుట్టాడనీ
Verse
వెన్నెల్లో పూసింది ఓ సందడీ - పలికింది ఊరంతా ఈ సంగతీ
ఈ దీనుడంట - పసిబాలుడంట - వెలిసాడు మహరాజుగా‖ 2x ‖
మనసున్న వాడు - దయ చూపువాడు
అలనాటి అనుబంధమే
కనులారా చూడు - మనసారా వేడు
దిగి వచ్చే మనకోసమే
ఇల దిగి వచ్చే మనకోసమే
Verse
ఆ నింగి తారల్లా వెలగాలిరా - జగమంత చూసేలా బ్రతకాలిరా
వెలిగించు వాడు - మనలోని వాడు - నిలిచాడు మన తోడుగా‖ 2x ‖
సలిగాలి రాత్రి - పిలిసింది సూడు
మనలోన ఒక పండగ
భయమేల నీకు - దిగులేల నీకు
యేసయ్య మనకుండగా
మన యేసయ్య మనకుండగా