Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yerushaleemu Gummamulaaraa Raajunu Loniki Raanimmu

యెరుషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము

Yerushaleemu Gummamulaaraa Raajunu Loniki Raanimmu

Chorus
యెరుషలేము గుమ్మములారా రాజును లోనికి రానిమ్ము
చిరునవ్వుతో ప్రభు యేసుని నేడే ఆహ్వానించుము
Verse
విజయుడై వచ్చుచున్నాడు శత్రు సాతానును ఓడించి
ఖర్జూర మట్టలు వస్త్రము లెందుకు
మీ హృదయములను పరువుడి
Verse
అభ్యంతర పరచకుము పిల్లలు, వృద్ధులు, యౌవనులన్
ప్రభుని విజయమునందు వారిని
స్తుతిస్తోత్రములు పాడనిమ్ము
Verse
నీ ధుష్టక్రియలను బట్టి ప్రభుని దయము త్రోసెదవా
పరమ రాజును హృదయ మందిరమున
నేడే రానిమ్ము స్నేహితుడా
Verse
నిన్ను దర్శించుటకే ప్రభు నీ చెంతకు వచ్చెనుగా
గాయపడిన హస్తమును చాచి
నీ మదిలో చోటిమ్మనెను
Verse
పశ్చాత్తాపము నొందుము నేడే నీ పాపము లొప్పుకొనుము
జీవము రక్షణ శాంతి నొసగును
ఆయనే ప్రభువు శ్లాఘించుము

Related Tags

WorshipInvitationGospel