Verse
యేసయ్యనీ ప్రేమ నాకు చాలయ్య
ఆ ప్రేమను ఎవరు వర్ణించ లేరయ్యా‖ 2x ‖
విలువైనది వెలకట్టలేనిది
సిరి సంపద కన్న బహు ఘనమైనది‖ 2x ‖
నా ప్రియుడైన యేసుని ప్రేమ దయచేయగలడు ఎవరికైనా‖ 2x యేసయ్య ‖
Verse
కన్నవారి ప్రేమ కంటే మిన్న అయిన ప్రేమ నిరంతరం నీవు నాపై చూపే ప్రేమ‖ 2x ‖
అల్ప కాలమైనది ఈ లోకపు ప్రేమ అత్యున్నతమైనది నా యేసుని ప్రేమ‖ 2x ‖
నా ప్రియుడైనయేసుని ప్రేమ దయచేయగలడు ఎవరికైనా‖ 2x యేసయ్య ‖
Verse
కఠినాత్ములు నైన కరుణించును ప్రేమ కనికరము కలిగిన నా యేసుని‖ 2x ‖
పగవారి పైన కురిపించును ప్రేమ పరిశుద్ధుడైన ఆ యేసుని ప్రేమ‖ 2x ‖
నా ప్రియుడైనయేసుని ప్రేమ దయచేయగలడు ఎవరికైనా‖ 2x యేసయ్య ‖
Verse
కలువరిలో సిలువ పైన చూపిన ప్రేమ రక్తం అంత ధారపోసి నన్ను కొన్న‖ 2x ‖
బలమైన మరణమును జయించిన ప్రేమ బలవంతుడైన మన యేసుని‖ 2x ‖
నా ప్రియుడైనయేసుని ప్రేమ దయచేయగలడు ఎవరికైనా‖ 2x యేసయ్య ‖