Verse
యేసన్న స్వరమన్నా
నీవెప్పుడైనా విన్నావా‖ 2x యేసన్న ‖
Verse
ఏదేను తోటలో ఆదాము చెడగా
ఆ దేవుడే పిలిచె‖ 2x ‖
యెహోవా ఎదుటను ఆదాము దాగిన‖ 2x ‖
అటులనే నీవును దాగెదవా‖ 2x యేసన్న ‖
Verse
జనముల శబ్దము జలముల శబ్దము
బలమైన ఉరుములతో‖ 2x ‖
కలిసిన స్వరము పిలిచిన యేసు‖ 2x ‖
పిలిచిన పిలుపును నీవింటివా‖ 2x యేసన్న ‖
Verse
ఆనాడు దేవుడు మోషేను పిలువగా
ఆలకించెను స్వరము‖ 2x ‖
ఈనాడు నీవును ఈ స్వరము వినగా‖ 2x ‖
కానాను చేరగా కదిలి రావా‖ 2x యేసన్న ‖