Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Janminche Ee Nelapai

యేసయ్య జన్మించే ఈ నేలపై

Yesayya Janminche Ee Nelapai

Verse
యేసయ్య జన్మించే ఈ నేలపై
సంబరాలు చేసేద్దాం ఏకమై…
లోకమును ప్రేమించి వచ్చిన
ప్రియ కుమారునికై…
ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం
లోకాన చాటేద్దాం
Verse
కన్నె మరియా గర్భమున
దైవసుతుడే జన్మించెను
జనన వార్తతో లోకమంతా
శుభ దినాలే మొదలాయెను
రక్షకుడే ఇలకొచ్చెను రక్షణతో
మనలను నడిపెను
మనతో ఒకరిగా ఉండెను
ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం
లోకాన చాటేద్దాం
Verse
సంతోషాలను పంచుకునే
దూత శుభవార్తనే తెచ్చెను
అవధులు లేని ఆనందంతో
ధరణియె ఉప్పొంగెను
ప్రవచనాలే నెరవేరేను
శ్రమదినాలే ఇక పోయెను
మనలో శాంతినే నింపెను
ఊరూరా వెళ్లేదాం సువార్త చేసెదం
లోకాన చాటేద్దాం

Related Tags

GospelChristmas