Verse
యేసయ్యా కనికరపూర్ణుడా
మనోహర ప్రేమకు నిలయుడా‖ 2x ‖
నీవే నా సంతోష గానము
సర్వ సంపదలకు ఆధారము‖ 2x యేసయ్యా ‖
Verse
నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి‖ 2x ‖
సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృప పొంది జీవింతును ఇల నీ కొరకే‖ 2x యేసయ్యా ‖
Verse
నా కొరకు సర్వము ధారాళముగా దయచేయువాడవు
దాహము తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి‖ 2x ‖
అలసిన వారి ఆశను తృప్తిపరచితివి
అనంత కృపపొంది ఆరాధింతును అనుక్షణము‖ 2x యేసయ్యా ‖
Verse
నీ వలన బలమునొందిన వారే ధన్యులు
నీ సన్నిధి అయిన సీయోనులో వారు నిలిచెదరు‖ 2x ‖
నిలువరమైన రాజ్యములో నిను చూచుటకు
నిత్యము కృపపొంది సేవించెదను తుదివరకు‖ 2x యేసయ్యా ‖
Verse
ఆరాధనకు యోగ్యుడవు ఎల్లవేళలా పూజ్యుడవు‖ 4x ‖
ఎల్లవేళలా పూజ్యుడవు ఆరాధనకు యోగ్యుడవు‖ 4x ‖