Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Kanikarapoornudaa Manohara Premaku Nilayudaa

యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా

Yesayya Kanikarapoornudaa Manohara Premaku Nilayudaa

Verse
యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా
నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము
Verse
నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి‖ 2x ‖
సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే " యేసయ్య "‖ యేసయ్య ‖
Verse
నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి
ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి
అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము " యేసయ్య "‖ యేసయ్య ‖
Verse
నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన
సీయెనులో వారు నిలిచెదరు
నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు
నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు " యేసయ్య "‖ యేసయ్య ‖
ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..

Related Tags

PraiseWorshipGrace