Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Maata Viluvaina

యేసయ్య మాట విలువైన

Yesayya Maata Viluvaina

Verse
యేసయ్య మాట విలువైన మాట
వినిపించుకోవా సోదరా
వినిపించుకోవా సోదరీ‖ 2x ‖
నీ గుండెలోన ముద్రించుకోవా
ఏ నాటికైనా గమనించలేవా
గమనించుము పాటించుము ప్రచురించుము
నిన్నూవలె నీ పొరుగువారిని
ప్రేమించమని ప్రేమించమని‖ యేసయ్య ‖
ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులని చెప్పిన మాట
నీతివిషయమై ఆకలిగొనువారు ధన్యులని చెప్పిన మాట
కనికరము గలవారు – హృదయశుద్ది గలవారు‖ 2x ‖
సమాధానపడువారు – సాత్వికులు ధన్యులని‖ 2x ‖
దుఃఖపడువారు ధన్యులని చెప్పిన మాట‖ యేసయ్య ‖
నరహంతకులు కోపపడువారు నరకాగ్నికి లోనగుదురని
అపహారకులు వ్యభిచరించువారు నరకములో పడిపోదురని
కుడిచెంప నిను కొడితే – ఎడమ చెంప చూపుమని‖ 2x ‖
అప్పడుగగోరువారికి నీ ముఖము త్రిప్పకుము‖ 2x ‖
నీ శత్రువులను ద్వేషించక ప్రేమించమని‖ యేసయ్య ‖

Related Tags

JesusBlessingLove