Verse
యేసయ్యా నా దొరా
నీ సాటి ఎవరయ్యా ఈ ధర
నా కోసమే వచ్చిన సర్వేశ్వరా
నను విడిపించిన కరుణాకరా
మనసార నిన్నే కొలుతు ప్రాణేశ్వరా
వేసారిపోనయ్యా ధవళాంబరా‖ 2x యేసయ్యా ‖
Verse
మండే నా బ్రతుకే పాటగా
నిండైన నీ బ్రతుకే బాటగా‖ 2x ‖
పండంటి నీ ప్రేమ తోటలో
మెండైన నీ వాక్యపు ఊటలో
దొరికింది నా వరాల మూట
సప్త స్వరాలే చాలవింక నా నోట‖ 2x యేసయ్యా ‖
Verse
నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా
వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా‖ 2x ‖
మిగిలిన శ్రమలను సంతర్పణలో
కదిలే కన్నీటి అర్చనలో
పండింది నా నోముల పంట
ఎంత పంచినా తరగదు ఈ దేటంట‖ 2x యేసయ్యా ‖
Verse
నా దాగు చోటు నీవేనయ్యా
చికాకు పడక నన్ను కాచేవయ్యా‖ 2x ‖
ఏకాకి నేనింక కాబోనయ్యా
నీ రాక కోసమే ఉన్నానయ్యా
శ్రీమంతుడా సాత్వికుడా
పరిపూర్ణుడా కడు దీనుడా‖ 2x యేసయ్యా ‖