Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Naa Hrudaya Spandana Neeve Kadaa

యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా

Yesayya Naa Hrudaya Spandana Neeve Kadaa

Lyricist: Bro Yesanna
Verse
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా‖ 2x ‖
విశ్వమంతా నీ నామము ఘణనీయము‖ 2x యేసయ్యా ‖
Verse
నీవు కనిపించని రోజున
ఒక క్షణమొక యుగముగా మారెనే‖ 2x ‖
నీవు నడిపించిన రోజున
యుగయుగాల తలపు మది నిండెనే‖ 2x యేసయ్యా ‖
Verse
నీవు మాట్లాడని రోజున
నా కనులకు నిద్దుర కరువాయెనే‖ 2x ‖
నీవు పెదవిప్పిన రోజున
నీ సన్నిధి పచ్చిక బయలాయెనే‖ 2x యేసయ్యా ‖
Verse
నీవు వరునిగా విచ్చేయి వేళ
నా తలపుల పంట పండునే‖ 2x ‖
వధువునై నేను నిను చేరగా
యుగయుగాలు నన్నేలు కొందువనే‖ 2x యేసయ్యా ‖

Related Tags

WorshipDevotional