Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Naa Praana Naatha

యేసయ్యా నా ప్రాణ నాథా

Yesayya Naa Praana Naatha

Verse
యేసయ్యా నా ప్రాణ నాథా
రుజువాయే – నీ ప్రేమ – నా యెడల – కల్వరిలో‖ 2x ‖
హల్లెలూయా హల్లెలూయా‖ 2x ‖
హల్లెలూయా నా యేసయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
నన్ను తలంచి ఏతెంచినవే – ఈ ధరకు
నా ఘోర స్థితి చూచి వెనుదీయలేదే – నీ ప్రేమ
నీ ఔన్నత్యం మహిమా ప్రభావం వీడితివి
కడు దీనుడవై నా పాప భారం మోసితివి
రిక్తుడవై వేలాడితివే
రక్తమే నాకై కార్చితివి‖ హల్లెలూయా ‖
Verse
పునరుత్తానుండా మృతి చెందలేదే – నీ ప్రేమ
యుగముల అంతము వరకు నాకై వేచినది – నీ ప్రేమ
ప్రత్యక్షపరచితివి ఈ పాపికి నీ ప్రేమ కల్వరిలో
శాశ్వత ప్రేమతో ప్రేమించుచున్నావని తెలిపితివి
అందదు నా మందికి అద్భుత ప్రేమ‖ 2x హల్లెలూయా ‖
Verse
నీ అనాది ప్రేమ పునాదులపై నన్ను – నిర్మించితివే
నీ స్వకీయ సంపాద్యముగా నన్ను – చేసితివే
నను చెక్కుకున్నావు ప్రేమతో నీ అరచేతులందు
ఎంతని వర్ణింతు నీ ప్రేమ నా యేసు దేవా
చాలదు నా జీవిత కాలమంతా‖ 2x హల్లెలూయా ‖

Related Tags

PraiseWorshipCalvary