Verse
యేసయ్యా నా ప్రాణమా – ఘనమైన స్తుతిగానమా
అద్భుతమైన నీ ఆదరణే – ఆశ్రయమైన నీ సంరక్షణయే
నను నీడగా వెంటాడెను – నే ఆలయక నడిపించెను
నా జీవమా – నా స్తోత్రమా – నీకే ఆరాధన
నా స్నేహమా – సంక్షేమమా – నీవే ఆరాధ్యుడా
Verse
చిరకాలము నాతో ఉంటానని – క్షణమైనా వీడిపోలేదని
నీలో ననుచేర్చుకున్నావని – తండ్రితో ఏకమై ఉన్నామని
ఆనందగానము నే పాడనా
ఏదైనా నాకున్న సంతోషము – నీతోనే కలిగున్న అనుబంధమే
సృజనాత్మకమైన నీ కృప చాలు – నే బ్రతికున్నది నీ కోసమే
Verse
జీవజలముగా నిలిచావని – జలనిధిగా నాలోఉన్నావని
జనులకు దీవెనగా మార్చావని – జగతిలో సాక్షిగా ఉంచావని
ఉత్సాహగానము నే పాడనా
ఏదైనా నీ కొరకు చేసేందుకు – ఇచ్చితివి బలమైన నీ శక్తిని
ఇదియే చాలును నా జీవితాంతము – ఇల నాకన్నియు నీవేకదా
Verse
మధురము కాదా నీ నామధ్యానం – మరుపురానిది నీ ప్రేమమధురం
మేలుచేయుచు ననునడుపువైనం – క్షేమముగా నా ఈలోకపయనం
స్తోత్రగీతముగా నే పాడనా – నిజమైన అనురాగం చూపావయ్యా –
స్థిరమైన అనుబంధం నీదేనయ్యా
స్తుతుల సింహాసనం నీ కొరకేగా – ఆసీనుడవై ననుపాలించవా
Chorus
స్తుతిపాత్రుడా – స్తోత్రార్హుడా నీకే ఆరాధన
ఆనందమే పరమానందమే – నీలో నా యేసయ్యా