Verse
యేసయ్యా నా ప్రాణనాథా నిను
ఆడి పాడి కీర్తించెదను
నీవే నా జీవదాత అని
లోకమంతా చాటించెదను‖ యేసయ్యా ‖
Verse
సర్వశక్తిమంతుడా సర్వాధికారి
సర్వలోకమును సృష్టించిన సుందరుడా‖ 2x ‖
స్తుతి మహిమా ఘనతా నీకే అని
సంతసించి స్తోత్రించెదను‖ యేసయ్యా ‖
Verse
పాపమే ఎరుగని నీతిమంతుడా
పాపిని రక్షించిన నీతిసూర్యుడా‖ 2x ‖
పరిశుద్ధ పరలోక తండ్రి అని
పరవశించి నే పాడెదను‖ యేసయ్యా ‖
Verse
ఆది అంతమైన అల్ఫా ఒమేగా
మేఘముపై రానున్న మహిమోన్నతుడా‖ 2x ‖
ఉన్నవాడవు అనువాడవు నీవని
ఉల్లసించి ఆరాధింతును‖ యేసయ్యా ‖