Verse
యేసయ్యా నా యేసయ్యా
నాపై నీకెందుకింత ప్రేమయ్యా‖ 2x ‖
నా పాపములను క్షమియించినావయ్యా
నా దోషమును భరియించినావయ్యా
నీ ప్రేమకు కొలతే లేదయ్యా
నా దాగు చోటు నీవయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
ఆజ్ఞను వినని అవిధేయత
నీ సన్నిధి నుండి తొలగించనీ‖ 2x ‖
ఉపద్రవములు నన్ను చుట్టుకొనగా
ఉపకారిగా నను చేర్చుకొంటివయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
లోకపు ఆశతో నిండియుండగా
జీవపు ఢంబము మదిని చేరగా‖ 2x ‖
చెడిపోయి నేను తిరిగి రాగా
నా రాకకై దారిలో వేచియుంటివి‖ 2x యేసయ్యా ‖