Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Naa Yesayya Eppudayya Nee Raakada

యేసయ్యా నా యేసయ్యా ఎప్పుడయ్యా నీ రాకడ

Yesayya Naa Yesayya Eppudayya Nee Raakada

Chorus
యేసయ్యా నా యేసయ్యా - ఎప్పుడయ్యా నీ రాకడ
యేసయ్యా నిన్ను చూడా ఆశయ్యా
రావయ్యా యేసయ్య రయమున‖ యేసయ్యా ‖
Verse
అ.ప. రమ్ము రమ్ము యేసునాధా వేగమె రారమ్ము
ఆమెన్‌ ఆమెన్‌ హల్లెలూయ ఆమెన్‌ హల్లెలూయ
Verse
చూచుటకెన్నో - వింతలున్నవి భువిలోన
చూడను ఎందరో - ఘనులున్నారు ధరలోన
ఏమి చూచిన - ఎవరిని చూచిన ఫలమేమి
నా కన్నులారా - నిన్ను చూడాలి యేసయ్యా‖ రమ్ము ‖
Verse
నా రూపమే మారునంట నిన్ను చూచువేళ
నిన్ను పోలి ఉంటానంట నీవు వచ్చువేళ
అనంతమైన నీ రాజ్యమే నా స్వదేశమయ్యా -
అందున్న సర్వసంపదలన్నీ - నా స్వంతమయ్యా‖ రమ్ము ‖
Verse
అమూల్యమైన రత్నములతో అలంకరింపబడి
గొఱ్ఱెపిల్ల దీపకాంతితో ప్రకాశించుచున్న
అంధకారమే లేని ఆ - దివ్యనగరమందు
అవధులు లేని ఆనందముతో - నీతో ఉండెదను‖ రమ్ము ‖

Related Tags

WorshipSecond ComingLonging