Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Naakantu Evaru Lerayya

యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా

Yesayya Naakantu Evaru Lerayya

Lyricist: Rev Fr Shiju
Verse
యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా‖ 2x ‖
నిన్ను నమ్మి నే బ్రతుకుచుంటిని
నిన్ను వెదకుచూ పరుగెత్తుచుంటిని
చూడు యేసయ్యా – నన్ను చూడు యేసయ్యా
చేయిపట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా‖ 2x యేసయ్యా ‖
Verse
కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని
బయట చెప్పుకోలేక మనసునేడ్చితి‖ 2x ‖
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు‖ 2x చూడు యేసయ్యా ‖
Verse
లోకమంత వెలివేయగ కుమిలిపోతిని
నమ్మినవారు నను వీడగ భారమాయెను‖ 2x ‖
లేరు ఎవరు వినుటకు
రారు ఎవరు కనుటకు‖ 2x చూడు యేసయ్యా ‖

Related Tags

FaithPrayerComfort