Verse 1
యేసయ్యా నాప్రియా !
ఎపుడో నీ రాకడ సమయం
Verse
దురవస్థలలో ఒంటరినై -దుమికి ధూళిగా మారినను‖ 2x ‖
దూరాన నీ ముఖ దర్శనము -ధృవతారగ నాలో వెలిగెనే‖ 2x యేసయ్యా ‖
Verse
మరపురాని నిందలలో - మనసున మండే మంటలలో‖ 2x ‖
మమతను చూపిన నీ శిలువను - మరచిపోదునా నీ రాకను‖ 2x యేసయ్యా ‖
Verse
ప్రియుడా నిన్ను చూడాలని - ప్రియ నీవలెనే మారాలని
ప్రియతమా నాకాంక్ష తీరాలని -ప్రియమార నామది కోరెనే‖ యేసయ్యా ‖