Verse
యేసయ్యా.. నన్నెందుకు ఎన్నుకున్నావయ్యా
తెలుపుము నీ చిత్తము నా యెడల‖ 2x యేసయ్యా ‖
Verse
ఏ దరి కానక తిరిగిన నన్ను
నీ కౌగిటిలో చేర్చుకున్నావయ్యా‖ 2x ‖
ఏమి నీ ప్రేమా – ఏమి నీ కృప నా యెడల‖ 2x ‖
ఏమి నీ కృప నా యెడల‖ యేసయ్యా ‖
Verse
చనిపోయిన స్థితిలో పడిపోయిన నన్ను
నీ జీవము నొసగి బ్రతికించావయ్యా‖ 2x ‖
ఏమి నీ దాక్షిణ్యం – ఏమి నీ దయ నా యెడల‖ 2x ‖
ఏమి నీ దయ నా యెడల‖ యేసయ్యా ‖
Verse
శోధనా బాధలో కృంగిన నన్ను
నిరీక్షణ నొసగి బలపరచావయ్యా‖ 2x ‖
ఏమి నీ ఆదరణ – ఏమి నీ ఆశ నా యెడల‖ 2x ‖
ఏమి నీ ఆశ నా యెడల‖ యేసయ్యా ‖