Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Nee Krupalo Nenundute Dhanyamu

యేసయ్య నీ కృపలో నేనుండుటే…ధన్యము

Yesayya Nee Krupalo Nenundute Dhanyamu

Lyricist: Lois Raj
Verse
యేసయ్య నీ కృపలో నేనుండుటే…ధన్యము
నీవు నాకు తెలియుటే బహు శ్రేష్టము
నేను నిన్ను ఎరుగుటే నిత్యజీవము
Verse
నీవు నన్ను చేసిన విధము చూడగా
నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది
నా ముందు వెనుకగా నీవు ఆవరించగా
ఆ జ్ఞానమే నాకు అందకున్నది
నీ ఆత్మనుండి నేనెటు వెళ్ళగలనయా
నీ సన్నిధినుండి నేనెటు వెళ్ళగలనయా
నీ చేతిలో నన్ను నీవు చెక్కియుండగా
Verse
నీ తలపులు ఎంతో ప్రియములైనవి
వాటి మొత్తము ఎంతో గొప్పదైనది
లెక్కించెదననుకొంటినా ఇసుక కంటెను
లెక్కకు ఎక్కువై అవి యున్నవి
నీ ఆత్మనుండి నేనెటు వెళ్ళగలనయా
నీ సన్నిధినుండి నేనెటు వెళ్ళగలనయా
నా దినములు నీ గ్రంథములో లిఖితమాయెగా
యేసయ్య నీ కృపలో నేనుండుటే ధన్యము
నీవు నాకు తెలియుటే బహు శ్రేష్టము
నేను నిన్ను ఎరుగుటే నా జీవితగమ్యము.

Related Tags

GraceEternal LifeWisdom