Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya Nee Poola Thota

యేసయ్యా నీ పూల తోట

Yesayya Nee Poola Thota

Verse
యేసయ్యా నీ పూల తోట
పుష్పించ లేదెందు చేత‖ 2x ‖
రకరకాల విత్తనాల
ప్రేమ మీద చల్లినావు‖ 2x ‖
మోసులెత్తినా – చిగురాకు లేచినా
పూవులెందుకు పూయలేదు
ఫలమెందుకు పండలేదు‖ యేసయ్యా ‖
Verse
సంఘాల స్థాపించినావు
సదుపాయములిచ్చినావు‖ 2x ‖
సంఘమెదిగినా – సంఖ్య పెరిగినా‖ 2x ‖
సాంగత్య ప్రశాంతి లేదు
సౌరభ్యము నిండలేదు‖ యేసయ్యా ‖
Verse
స్వార్ధ రహితుల కాపు లేదు
ఆత్మ జీవికి పెంపు లేదు‖ 2x ‖
సేవ చేసినా – సువార్త సాగినా‖ 2x ‖
పూలెందుకు పూయలేదు‖ 2x ‖
ఫలమెందుకు పండలేదు‖ యేసయ్యా ‖

Related Tags

WorshipSpiritual GrowthReflection