Verse
యేసయ్యా నిన్ను చూడాలని ఆశ
మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ‖ 2x ‖
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో
ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు
ఇమ్మానుయేలైన నా దైవం నీవేగా‖ 2x యేసయ్యా ‖
Verse
అందరు ఉన్నారని అందరు నావారని‖ 2x ‖
తలచితిని భ్రమచితిని చివరికి ఒంటరి నేనైతిని‖ 2x ‖
నా గానం నీవయ్యా నా ధ్యానం నీవయ్యా
నా ప్రాణం నీవయ్యా నా సర్వం నీవయ్యా‖ యేసయ్యా ‖
Verse
అంధకారములో అంధుడ నేనైతిని‖ 2x ‖
నిను చూచే నేత్రములు నాకొసగుమా నజరేయుడా‖ 2x ‖
నా ఆశ నీవయ్యా నా ధ్యాస నీవయ్యా
నా భాష నీవయ్యా నా శ్వాస నీవయ్యా‖ యేసయ్యా ‖