Verse
యేసయ్యా నిన్ను ప్రేమించువారు
బలమైన సూర్యుని వలెనె ఉదయించెదరు నిత్యము‖ 2x ‖
శాశ్వత కాలం నీతోనే నివసింతురు‖ 2x యేసయ్య ‖
Verse
నిన్ను ప్రేమించువారు
సకలమైన ఉపద్రవముల నుండి‖ 2x ‖
నిర్దోషులై కాపాడబడెదరు
అపవాది అగ్ని బాణముల నుండి‖ 2x యేసయ్య ‖
Verse
నిన్ను ప్రేమించువారు
దేవ దూతల జ్ఞానమును కలిగుందురు‖ 2x ‖
సమకూడి జరుగును సమస్తము
సదా మాతో ఉన్నందున‖ 2x యేసయ్య ‖
Verse
నిన్ను ప్రేమించువారిని
ఎవ్వరునూ ద్వేషించి జయమొందలేరు‖ 2x ‖
మా ప్రక్క నిలిచి సింహాల నోటి నుండి
తప్పించి బలపరచినావు‖ 2x యేసయ్య ‖
Verse
నిన్ను ప్రేమించువారి
చేతులకు వారి శత్రువుల నప్పగింతువు‖ 2x ‖
వారి కాలమంతట దేశమంతయు
నెమ్మదిగా నుండును‖ 2x యేసయ్య ‖