Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesayya O Naa Yesayya

యేసయ్య ఓ నా యేసయ్య

Yesayya O Naa Yesayya

Verse
చూడుము నా అరచేతులలోనే నిన్ను చెక్కియున్నాను...
అని వాగ్దానము చేసిన యేసయ్య!
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును,
ముదిమి వచ్చువరకు నిన్ను ఎత్తుకొని కాపాడును...
నిన్ను కాపాడువాడు, కునుకడు, నిదురించడు, అని వాగ్దానములను చేసిన యేసయ్య ఓ నా యేసయ్య! యేసయ్య ఓ నా యేసయ్య!
వందనం నీకే మా వందనం! వందనం నీకే మా వందనం!
Verse
విననేరకుండునట్లు నా చెవులు మందము కాలేదు...
నిన్ను కాపాడనేరకుండునట్లు నా హస్తములు కురుచకాలేదు
మీకును నాకును మీ పాపములు అడ్డుగా ఉండగా...
ప్రార్థించుము... పాప విమోచనకై ప్రార్ధించుము అని తెలిపిన దేవా!
వందనం నీకే మా వందనం! వందనం నీకే మా వందనం!
Verse
మీ పాపములనుండి విడిపించుటకు నాప్రియ కుమారుని
రక్తప్రోక్షణ అవశ్యమని అనుగ్రహించితినని తెలియజేసిన దేవా!
మీ పాపములను విడిచి నీతి పరిశుద్ధతతో జీవించుటకు
కుమారునితో హత్తుకొని ఉండమని తెలియజేసిన దేవా!
వందనం నీకే మా వందనం! వందనం నీకే మా వందనం!
Verse
నన్ను అడిగినచో భూజనులను స్వాస్త్యముగా,
భూదిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదనని,
మీ ప్రియ కుమారులకు వాగ్దానం చేసిన దేవా!
తల్లి మరిచినా, తండ్రి విడిచినా, విడవను ఎడబాయనని వాగ్దానము చేసిన దేవా!
మీలో మేము జీవించునట్లుగా చేయుము దేవా! చేయుము తండ్రి!
వందనం నీకే మా వందనం! వందనం నీకే మా వందనం!
Verse
మీ అగ్ని 4అభిషేకమును మాకు అనుగ్రహించుము దేవా!
మీ పరిశుద్ధ దేవదూతల సహాయమును పంపుము దేవా!
తండ్రి కుమార పరిశుద్ధాత్మతో అభిషేకించి ఆదరించుము దేవా!
మీలో మేము జీవించునట్లుగా మాకై మీ ఆత్మను అనుగ్రహించుము దేవా!
వందనం నీకే మా వందనం! వందనం నీకే మా వందనం!
Verse
తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును,
ముదిమి వచ్చువరకు నన్ను ఎత్తుకొని కాపాడును,
నా రక్షణ కర్తవు నీవేనయ్యా నా ఆత్మకు ఆదరణ నీవేనయ్యా!
యేసయ్య ఓ నా యేసయ్య! యేసయ్య ఓ నా యేసయ్య!
వందనం నీకే మా వందనం! వందనం నీకే మా వందనం!

Related Tags

WorshipDevotionalPromise