Verse
యేసయ్యా ప్రాణ నాథా – ఎంతో మంచోడివయ్యా
సిలువలో ప్రాణం పెట్టినావయ్యా
రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా
నన్ను.. రక్తమిచ్చి కొన్నావయ్యా యేసయ్యా
Verse
మరణాంధకారములో పడియున్న వేళ
ఉదయించినావు ఓ నీతి సూర్యుడా‖ 2x ‖
కురిసింది కల్వరి ప్రేమ నీ రుధిర ధారలై‖ 2x ‖
నిను వీడి క్షణమైనా నే బ్రతుకలేను‖ 2x యేసయ్యా ‖
Verse
మరణ పాశాలన్ని ఛేదించినావు
ప్రేమ పాశాలతో దీవించినావు‖ 2x ‖
నీ ప్రేమ బానిసగా నను చేసుకున్నావు‖ 2x ‖
మోడైన నా బ్రతుకు చిగురింపజేశావు‖ 2x యేసయ్యా ‖
Verse
మృతిని గెల్చి లేచావు మహిమను దాల్చావు
ఈ మట్టి దేహాన్ని మహిమతో నింపావు‖ 2x ‖
నా సృష్టికర్తవు నా క్రీస్తు నీవు‖ 2x ‖
రానున్న రారాజు నీ వధువు నేను‖ 2x యేసయ్యా ‖