Verse
యేసయ్యానీ భావాలు ఆ యెదలోనే నిండాలి
ఏ జాములోనైనా నా యెదలో పొంగాలి‖ 2x ‖
Verse
కనులారా నా ప్రభువా నీవు కనిపించాలి
కడదాకా నా బ్రతుకు నీవు నడిపించాలి
నీ కరుణ మార్గములో నేను నడవాలి
నీ జీవజలములనే నేను సేవించాలి
Verse
నీ మెల్లని స్వరము నాకు వినిపించాలి
నీ ఆత్మ ఫలములను నేను ఫలియించాలి
రూపాంతరనుభవము నేను పొందాలి
నీ మహిమ రూపమునే నేను చూడాలి