Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Goppa Devudu

యేసే గొప్ప దేవుడు

Yese Goppa Devudu

Verse
యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు‖ 2x ‖
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు‖ 2x ‖
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్‖ 2x యేసే ‖
Verse
మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను‖ 2x ‖
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే‖ 2x స్తోత్రము ‖
Verse
ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును‖ 2x ‖
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే‖ 2x స్తోత్రము ‖
Verse
జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను‖ 2x ‖
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే‖ 2x స్తోత్రము ‖

Related Tags

PraiseWorshipJesus