Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Manakila Swasthyamu Verae Swasthyamu Ledhikanu

యేసే మనకిల స్వాస్థ్యము వేరే స్వాస్థ్యము లేదికను

Yese Manakila Swasthyamu Verae Swasthyamu Ledhikanu

Verse
యేసే మనకిల స్వాస్థ్యము
వేరే స్వాస్థ్యము లేదికను
Verse
అక్షయమును నిర్మలమైన
వాడబారని స్వాస్థ్యము మనకు
కరుణతో నొసగెను దేవుడు
హర్షముతో స్తుతియించెదము
Verse
మనము క్రీస్తుని సంబంధులము
వాగ్దానముతో వారసులముగా
చేయబడితిమి స్థిరముగా
చేతులెత్తి పూజించెదము
Verse
దేవుని సంకల్పమును బట్టి
మనలను ముందే నిర్ణయించి
మనకొక స్వాస్థ్యము నేర్పరచెన్
మనసార మరి పాడెదము
Verse
పరిశుద్ధుల స్వాస్థ్యములో మనలను
పాలుపొందుటకు పాత్రుల జేసిన
పరమ తండ్రికి స్తోత్రములు
నిరతంబును చెల్లించెదము
Verse
క్షేమమును మరి అభివృద్ధియును
కలుగ జేయుటకు శక్తిమంతుడు
స్వాస్థ్యము నిచ్చిన దేవునికి
హల్లెలూయ పాడెదము

Related Tags

WorshipInheritance