Verse
యేసే నా పరిహారి
ప్రియ యేసే నా పరిహారి
నా జీవిత కాలమెల్ల
ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x యేసే నా ‖
Verse
ఎన్ని కష్టాలు కలిగిననూ
నన్ను కృంగించె భాదలెన్నో‖ 2x ‖
ఎన్ని నష్టాలు వాటిల్లినా
ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x యేసే నా ‖
Verse
నన్ను సాతాను వెంబడించినా
నన్ను శత్రువు ఎదిరించినా‖ 2x ‖
పలు నిందలు నను చుట్టినా
ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x యేసే నా ‖
Verse
మణి మాన్యాలు లేకున్ననూ
పలు వేదనలు వేధించినా‖ 2x ‖
నరులెల్లరు నను విడచినా
ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x యేసే నా ‖
Verse
బహు వ్యాధులు నను సోకినా
నాకు శాంతి కరువైనా‖ 2x ‖
నను శోధకుడు శోధించినా
ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x యేసే నా ‖
Verse
దేవా నీవే నా ఆధారం
నీ ప్రేమకు సాటెవ్వరూ‖ 2x ‖
నా జీవిత కాలమంతా
నిన్ను పాడి స్తుతించెదను‖ 2x యేసే నా ‖