Verse
యేసే నా పరిహారి - ప్రియ యేసే నా పరిహారి
నా జీవితకాలమెల్ల - ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x ‖
Verse
ఎన్ని కష్టాలు కలిగినను - నన్ను కృంగించె బాధలెన్నో‖ 2x ‖
ఎన్ని నష్టాలు శోభిల్లిన - ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x ‖
Verse
నన్ను సాతాను వెంబడించిన - నన్ను శత్రువు ఎదిరించిన‖ 2x ‖
పలు నిందలు నను చుట్టిన - ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x ‖
Verse
మణి మాణ్యాలు లేకున్న - మనోవేదనలు వేధించిన‖ 2x ‖
నరులెల్లరు నను విడచిన - ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x ‖
Verse
బహు వ్యాదులు నను సోకిన - నాకు శాంతి కరువైన‖ 2x ‖
నను శోధకుడు శోధించిన - ప్రియ ప్రభువే నా పరిహారి‖ 2x ‖
Verse
దేవా నీవే నా ఆధారం - నీ ప్రేమకు సాటెవ్వరు‖ 2x ‖
నా జీవిత కాలమంతా - నిను పాడి స్తుతించెదను‖ 2x ‖