Verse
యేసే నీ ఆధారము దిగులు చెందకు
మరలా వెనుదిరుగకు ధైర్యముగా ఉండు
ఓర్పుతో వేచి ఉండు నూతన బలము నొందెదవు
పక్షిరాజు వలే పైపైకి ఎగురుదువు
Pre-Chorus
సహనమును విడువకు ఇక కొద్ది కాలమే
నిబ్బరం కలిగి ఉండు విజయము నీదే
Chorus
నిరీక్షణ కోలిపోకుము – యేసేగా నీ సహాయము
Verse
యేసే నా ఆధారము దిగులు చెందను
మరలా వెనుదిరుగను ధైర్యముగా ఉందున్
ఓర్పుతో వేచి ఉందున్ నూతన బలము నొందెదను
పక్షిరాజు వలే పైపైకి ఎగురుదును
బంధకము లోను నిరీక్షణ గలవారలారా
రెండింతల మేలును చేయువాడు ఆయనే
నీ గూర్చి ఉద్దేశించిన తలంపులాయన ఎరుగును
అవి మేలైనవి కీడు కొరకు కాదు
Pre-Chorus
సహనమును విడువను ఇక కొద్ది కాలమే
నిబ్బరం కలిగి ఉందున్ విజయము నాదే
Chorus
నిరీక్షణ కోలిపోను నేను – యేసేగా నా సహాయము
Outro
యేసే నా రక్షణ యేసే నా నిరీక్షణ