Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yese Nee Madhilo Undagaa

యేసే నీ మదిలో ఉండగా

Yese Nee Madhilo Undagaa

Verse
యేసే నీ మదిలో ఉండగా
కలతే దరి చేరగ రాదుగా‖ 2x ‖
సోదరా సోదరీ.. యేసులో నెమ్మది
ఓ సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ మది‖ యేసే ‖
Verse
తీరిపోని బాధలెన్నో నిన్ను బంధించినా
ఓర్వలేని మనుజులంతా నిన్ను నిందించినా‖ 2x ‖
నీ చెంతకు చేరి నిలుపును
నీ చింతను తీర్చి నడుపును‖ 2x ‖
సోదరా సోదరీ.. యేసే నీ మాదిరి
సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నీ గురి‖ 2x యేసే ‖
Verse
సిలువపైన బలిగా మారి నిన్ను ప్రేమించెనే
సహింపలేని శోధనలను నీకు దయచేయునా‖ 2x ‖
శోధనలను గెలిచే మార్గము
తప్పక నీకొసగును తథ్యము‖ 2x ‖
సోదరా సోదరీ.. యేసులో విజయము
సోదరా సోదరీ.. యేసుపై నిలుపు నమ్మకం‖ 2x యేసే ‖

Related Tags

ComfortPeaceTrust