Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesey Goppa Devudu Mana Yesey Shakthimanthudu

యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు

Yesey Goppa Devudu Mana Yesey Shakthimanthudu

Lyricist: Philip Gariki
Verse
యేసే గొప్ప దేవుడు – మన యేసే శక్తిమంతుడు
యేసే ప్రేమ పూర్ణుడు – యుగయుగములు స్తుతిపాత్రుడు
స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి
ఘనతా బలము కలుగును ఆమెన్
Verse
మహా శ్రమలలో వ్యాధి బాధలలో
సహనము చూపి స్థిరముగ నిలచిన
యోబు వలె నే జీవించెదను
అద్వితీయుడు ఆదిసంభూతుడు
దీర్ఘ శాంతుడు మన ప్రభు యేసే
Verse
ప్రార్థన శక్తితో ఆత్మ బలముతో
లోకమునకు ప్రభువును చాటిన
దానియేలు వలె జీవింతును
మహోన్నతుడు మన రక్షకుడు
ఆశ్రయ దుర్గము మన ప్రభు యేసే
Verse
జీవితమంతా ప్రభుతో నడచి
ఎంతో ఇష్టుడై సాక్ష్యము పొందిన
హనోకు వలె నే జీవించెదను
అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు
నీతి సూర్యుడు మన ప్రభు యేసే

Related Tags

PraiseWorshipJesus