Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Aatma Priyuda Ninnu Naashrayinchithi

యేసూ ఆత్మ ప్రియుడా నిన్ను నాశ్రయించితి

Yesu Aatma Priyuda Ninnu Naashrayinchithi

Verse
యేసూ, ఆత్మ ప్రియుడా - నిన్ను నాశ్రయించితి
లేవగా దరంగముల్ - గాలివాన కొట్టగా
జీవ బాధలన్నిటన్ - నన్ను దాచు రక్షకా
నన్ను నడ్పి రేవునన్ - ఆత్మ జేర్చుమీ తుదన్
Verse
దిక్కులేని యాత్మకు - వేరే ప్రాపు లేదిక
నొంటిగాను విడ్వక - నన్ను యాదరించుమీ
నిన్నే నమ్మియుంటిని - నీవే నా సహాయము
కాపులేని నా తలన్ - నీదు రెక్క క్రమ్మనీ
Verse
క్రీస్తు నిన్ను గోరుదున్ - దొర్కునన్ని నీకడన్
పడ్డహీను నెత్తుమీ - స్వస్థపర్చు రోగులన్
న్యాయ శుద్ధ నామము - నీదే నేను పాపిని
నేను పాపపూర్ణుడన్ - నీవు ప్రేమరూపివి
Verse
పాపమెల్ల మాంపగా - నీదు ప్రేమ చాలును
మాంపు నీళ్ళు నా యెదన్ - శుద్ధిచేయగా నిమ్ము
నీవు జీవపూటవు - త్రాగనిమ్ము నీదరిన్
పుట్టి నాదు నాత్మలో - నెల్ల వేళ పారుమీ

Related Tags

DevotionalPrayerRefuge