Verse
యేసు భజనయే మనలను ఆ సుగతికిఁ దీయు జనులారా దాసజనులు
జేయు పలు దోసములు మోయు‖ యేసు ‖
Verse
మేల కులశీల వ్రత జా లాధిక మేల చాల మన మీలాగునఁ
గాలావధి ఁగూల‖ యేసు ‖
Verse
అక్షయ కరుణేక్ష భువన రక్షణ ఖల శిక్షా ధ్యక్ష బుధ పక్ష కృత
మోక్ష యను దీక్షన్‖ యేసు ‖
Verse
మాటికి మిన్నేటికిఁ బో నేటికిఁ గాల్ నొవ్వ సూటిగ నరకోటి దురిత
వాటములను మీటు‖ యేసు ‖
Verse
శ్రోత్రమ యపవిత్ర నర చ రిత్రలు వినఁబోక మైత్రిని బరమాత్ముని కథ
మాత్రము విను మనుచున్‖ యేసు ‖
Verse
మన జీవనమునకు మారుగఁ తన ప్రాణము నిచ్చెన్ తన రక్తముచేఁ
పావన మొనరించెను మనలన్‖ యేసు ‖