Chorus
యేసు భక్తవరులతో ని వాసముందమ యేసుదాసు లౌదమ‖ యేసు ‖
Verse
దోసములను తీగలన్ని కోసివేతమ మిగుల మోసపుచ్చు నాసలెల్ల
రోసివేతమ యేసుదాసు లౌదమ‖ యేసు భక్త ‖
Verse
దోసిలొగ్గి ప్రభునివేడ గాసి పడుదమ వాసిగాను యేసుమీద
నాసపడుదమ యేసు దాసు లౌదమ‖ యేసు భక్త ‖
Verse
జారచోర దుష్కృతములు పారవేతమ సత్య సార మెరుగ బరమ
గురుని జేరు కొందమ యి(క కోరు కొందమ‖ యేసు భక్త ‖
Verse
ప్రాపు లేనివారికెల్ల దా పొసంగును యేసు శాపరాసులన్ని తానే యోపి
మోసెను తండ్రి దాపొసంగును‖ యేసు భక్త ‖
Verse
శరణుజొ చ్చు నందరకును దురిత మెంచక ఘోర మరణ బాధలెల్ల
దీర్చి పరమొసంగును స్ధిర వరము లిచ్చును‖ యేసు భక్త ‖
Verse
లోక భోగముల మదిన్ని రాకరింతమ ప్రభు రాక కెదురు జూడ మన
మేక మౌదమ ఇపుడె యేక మౌదమ‖ యేసు భక్త ‖