Verse
యేసు చాలును యేసు చాలును
యే సమయమైన యే స్థితికైన
నా జీవితములో యేసు చాలును
Verse
పరమజీవము నాకు నివ్వ తిరిగి లేచెను నాతో నుండ
నిరంతరము నన్ను నడిపించును మరల వచ్చి యేసు కొని పోవును‖ యేసు ‖
Verse
సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను
లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను‖ యేసు ‖
Verse
పచ్చిక బయలులో పరుండజేయున్ శాంతి జలము చెంత
నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ మరణ
లోయలో నన్ను కాపాడును‖ యేసు ‖
Verse
నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను
హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడచినను‖ యేసు ‖