Verse
యేసు దేహము సంఘము ప్రభు క్రీస్తుపై వి శ్వాస మమరి క్రా లెడు
జనము యేసు ప్రాయశ్చిత్త రక్తము దోసములను బాపు నంచు నాసతోడ
నమ్మి తమ ప్ర యాసములను దీర్చుకొన్న‖ యేసు ‖
Verse
స్థాపకుఁడు యెహోవా దేవుఁడు పాపులను గావ నోపి సుతునిఁ బంపె
కరుణుఁడు ఈ పవిత్ర సంఘమునకు దీపము పరిశుద్ధ వేద మేపుమీఱు
శిరసు క్రీస్తు కాపుకర్త పావనాత్మ‖ యేసు ‖
Verse
వరుఁడు క్రీస్తు యేసునాధుని మురువంపు వధువై పరఁగు నహ
విశేషఖ్యాతిని సరిగెపట్టు నారచీర లరయ నీతి న్యాయము లవి యురుతరా
భరణముల సుం దరము భక్తి వర్తనంబు‖ యేసు ‖
Verse
తన యమూల్య రక్తముఁ దెచ్చి యనురక్తుఁ డీమె కనిశ శుల్క దా
నమునిచ్చి ఘనుఁ డగు నా పావనాత్మ తనకుఁ దోడుజేసి మంచి పని
తనమున నీమె కొక్క భవనముఁ గట్టంగఁ బోయె‖ యేసు ‖
Verse
మరణ విజయుఁ డైన వీరుఁడు మహాబ్రములపై నరుగుదెంచు మహిమ
శూరుఁడు నిరతప్రేమ కాముఁ డీమె కరముబట్టి పెండ్లి యాడఁ ద్వరగ
వచ్చుఁ గాన భక్తి పెరుగు బ్రతుకు టుత్తమంబు‖ యేసు ‖