Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Devaa Nanu Konipovaa

యేసు దేవా నను కొనిపోవా

Yesu Devaa Nanu Konipovaa

Verse
యేసు దేవా నను కొనిపోవా
నీ రాజ్యముకై వేచియున్నా‖ 2x ‖
శాంతి లేని లోకాన – నీ ప్రేమ కరువయ్యింది
శాంతి లేని లోకాన – నీ ప్రేమ కనుమరుగయ్యింది
నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను
అంత వరకు నీదు శక్తినిమ్మయా
నీ రాక కోసమే నే ఎదురు చూస్తున్నాను
అంత వరకు నన్ను నీదు సాక్షిగా నిల్పుము‖ యేసు ‖
Verse
ఎటు చూసినా అక్రమమే కనబడుతుంది
ఎటు తిరిగినా అన్యాయం ప్రబలి ఉంది‖ 2x ‖
నీ ప్రేమతో నను కాచి కాపాడు దేవా
నీ రాక వరకు నను నిలబెట్టుము దేవా‖ 2x యేసు ‖
Verse
నీ రాజ్యముకై ఈ లోకములో నీ కాడిని మోసెదను
నీవు ప్రేమించిన నీ బిడ్డలను నీ మందలో చేర్చెదను‖ 2x ‖
నీ ఆత్మ తోడుతో నను బ్రతికించుము
నీ ఆత్మ శక్తితో నను బలపరచుము
నీ మహిమ రాజ్యమందు నీతో కూడా వసియించుటకు
కడ వరకు ఈ భువిలో నమ్మకంగా బ్రతికెదను‖ యేసు ‖

Related Tags

Second ComingPrayerHope