Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Devuni Aashrayinchumaa

యేసు దేవుని ఆశ్రయించుమా

Yesu Devuni Aashrayinchumaa

Verse
యేసు దేవుని ఆశ్రయించుమా
సోదరా సోదరీ ఈ క్షణమే
విశ్వసించుమా తండ్రిని వేడుమా
గొప్పకార్యాలు జరుగును నీ యెదుటే
స్వస్థత లేక… సహాయము లేక… సోలిపోయావా?
యేసు నామములోనే స్వస్థత – యేసు కృపలోనే భద్రత
యేసు రక్తములోనే విమోచన – యేసే నడిపించును జీవమార్గాన
Verse
రోగియైన దాసుని కొరకు
శతాధిపతి యేసు ప్రభుని వేడుకొనెను
మాట మాత్రం సెలవిమ్మనగా
విశ్వసించిన ప్రకారమే స్వస్థతను పొందెను
విశ్వసించి అడుగుము అద్భుతాలు జరుగును‖ 2x ‖
యేసు నందు విశ్వాసముంచుము‖ 2x ‖
||యేసు నామములోనే||‖ యేసు నామములోనే ‖
Verse
దు:ఖ స్థితిలో హన్నా తన ఆత్మను
దేవుని సన్నిధిని కుమ్మరించుకొనెను
మొక్కుబడి చేసి ప్రార్థించెను
దీవింపబడెను కుమారుని పొందెను
నీవు అడుగుము నీకివ్వబడును‖ 2x ‖
యేసుని ప్రార్థించుము‖ 2x ‖
||యేసు నామములోనే||‖ యేసు నామములోనే ‖
Verse
శోధనలనైనా సమస్తమును కోల్పోయిన
యోబువంటి విశ్వాసం గమనించుమా
యధార్ధతతో నిరీక్షించెను
రెండంతల దీవెనలు పొందుకొనెను
సహనము చూపుము సమకూడి జరుగును‖ 2x ‖
యేసు నందు నిరీక్షించుము‖ 2x ‖
||యేసు నామములోనే||‖ యేసు నామములోనే ‖

Related Tags

FaithPrayerHealingTrust