Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Divya Rakshakuni Sthuthinchu Bhoomi Divya Premanu Chaatumu

యేసు దివ్య రక్షకుని స్తుతించు భూమీ దివ్య ప్రేమను చాటుము

Yesu Divya Rakshakuni Sthuthinchu Bhoomi Divya Premanu Chaatumu

Verse
యేసు దివ్య రక్షకుని స్తుతించు - భూమీ - దివ్య ప్రేమను చాటుము
ముఖ్యదూతలారా శుభ మహిమను - బలఘనముల నర్పించుడి
మోయురీతి యేసు కాపాడు మిమ్మున్ - చేతులందు మోయుచుండును
సీయోను వాసులగు భక్తులారా - సంతోష గీతములు పాడుడి
Verse
యేసు దివ్యరక్షకుని స్తుతించు - పాపమునకై మరణించెను
బండ నిత్యరక్షణ నిరీక్షణుండు - సిల్వ వేయబడిన యేసుడు
రక్షకా భరించితి దుఃఖ వార్థిన్ - ముండ్ల మకుట ధారివైతివి
త్యజింపబడి చేయి వీడబడిన - మహిమా ప్రభూ నీకే స్తోత్రము
Verse
యేసు దివ్య రక్షకుని స్తుతించు - నాక గుమ్మములారా పాడుడి
యేసు నిత్యానిత్యము రాజ్యమేలున్ - గురుద్దేవ రాజు నాయనే
మరణ విజయుడు మాదు రాజు - మృత్యువా నీ ముల్లు యెక్కడ?
యేసు జీవించియున్న జయవీరుండు - నీ గుమ్మముల్ కీర్తించి పాడనీ

Related Tags

PraiseWorship