Verse
యేసు గొరియ పిల్లను నేను
వధకు తేబడిన గొరియ పిల్లను‖ 2x ‖
దినదినము చనిపోవుచున్నాను
యేసు క్రీస్తులో బ్రతుకుతున్నాను‖ 2x యేసు గొరియ ‖
Verse
నా తలపై ముళ్ళు గుచ్చబడినవి
నా తలంపులు ఏడుస్తున్నవి‖ 2x ‖
నా మోమున ఉమ్మి వేయబడినది
నా చూపులు తల దించుకున్నవి‖ 2x యేసు గొరియ ‖
Verse
నా చేతుల సంకెళ్ళు పడినవి
నా రాతలు చెరిగిపోతున్నవి‖ 2x ‖
నా కాళ్ళకు మేకులు దిగబడినవి
నా నడకలు రక్త సిక్తమైనవి‖ 2x యేసు గొరియ ‖