Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Kosame Jeeviddaam Yesuthone Payaniddaam

యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం

Yesu Kosame Jeeviddaam Yesuthone Payaniddaam

Lyricist: Joel Kodali
Verse
యేసు కోసమే జీవిద్దాం యేసుతోనే పయనిద్దాం
యేసుని పోలి నడిచే సాక్షులం
యేసు విలువలు కలిగుందాం యేసు పిలుపునకు లోబడదాం
లోకములో యేసుని ప్రతినిధులం
శోధనలెదురైనా అవరోధములెన్నున్నా
విశ్వాసములో నిలకడగా నిలిచుందాం కడవరకు
ఈ జీవిత యాత్రలో లోతులు కనబడినా
లోబడకుందుము లోకముకు ఏ సమయములోనైనా‖ యేసు కోసమే ‖
Verse
నిందారహితులుగా జీవించుట మన పిలుపు
నీతియు పరిశుద్ధతయు ప్రభు కోరే అర్పణలు
యదార్ధవంతులుగా ఒక మంచి సాక్ష్యము
లోకమునకు కనపరచుటయు దేవుని పరిచర్యే
ప్రేమయు సహనము యేసుని హృదయము
కలిగుండుటకు పోరాడెదం ఆశతో అనుదినము‖ యేసు కోసమే ‖
Verse
యేసు స్వభామును ధరించిన వారలము
మరణం గెలిచిన క్రీస్తుని ప్రకటించే శిష్యులము
సంకటములు ఎదురైనా అవి అడ్డుగా నిలిచినను
రోశముగల విశ్వాసముతో ఆగకనే సాగెదము
రాజులు జనములు యేసుని చూచెదరు
విశ్వాసులు విశ్వాసములో స్థిరముగ ఉన్నప్పుడు‖ యేసు కోసమే ‖

Related Tags

FaithChristian LifeDiscipleship