Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Kreesthu Prabhuvaayanae Amdhariki Prabhuvu

యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు

Yesu Kreesthu Prabhuvaayanae Amdhariki Prabhuvu

Verse 1
Reference: పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. 1 తిమోతి Timothy 1:15
Chorus
యేసు క్రీస్తు ప్రభువాయనే అందరికి ప్రభువు
పశువుల పాకన్ పరుండెను తానే దేవుడై యుండి
Verse
నరులన్ గావన్ శ్రమల బొందెన్ క్రీస్తు ప్రభువు
తిరిగెన్ భువిన్ సుఖమున్ విడచి శిష్యులు వెంటనుండన్
Verse
నిత్యజీవం నిత్య శాంతి నిండు నెమ్మది
నిత్యుండేసు మనకు నివ్వ మృత్యువున్ గెల్చెను
Verse
భీతిన్ గొలుపు అలలు పైకి లేచినంతనే
భీతిన్ విడచి యేసు వైపు చూడు నిమ్మళించును
Verse
మరణమేలు లోయలందు సంచరించెడు
తరుణములు కలిగినను క్రీస్తు మీ చెంతనుండున్
Verse
మన జీవము క్రీస్తే గదా క్రీస్తున్ తేరి చూచి
తనయులమై యుద్ధమందు జయము నొందెదము

Related Tags

WorshipSalvationJesus