Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Kreesthundu Nithya Devudu

యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు

Yesu Kreesthundu Nithya Devudu

Lyricist: Gollapalli Nathaniel
Chorus
యేసు క్రీస్తుఁడు నిత్య దేవుఁడు ఎఱిగి నమ్ముఁడి మనుజులారా మోస
మొందక మోక్షపతికిఁక దాసులై బ్రతుకండి రండి‖ యేసు ‖
Verse
ఆరు దినములలోపలనే యాకసము భూలోకములను ప్రాకటముగఁ
జేసి నాఁడు ప్రకాశుఁడాయన ప్రజ్ఞవంతుఁడు‖ యేసు ‖
Verse
ఆది పురుషుని యాదిస్త్రీనిఁక హస్తములతో నంటి చేసెను మేదినిన్
ఫలవనములో న సాధులై నివసింప నిచ్చెను‖ యేసు ‖
Verse
వార లిద్దపు దేవునాజ్ఞను కోరికలతో మీరినప్పుడు గారడీ పిశాచ తంత్రము
వారి పరమై పాపులైరి‖ యేసు ‖
Verse
వీరలందఱు వారి సంతతి వేరెలేరీ ధరణిలో దు ష్యార్యులై దేవుని
యాజ్ఞలు మీరి రందఱు నరక పాత్రులు‖ యేసు ‖
Verse
ఇంత పాపభరితులై కా సంతసత్యము లేని నరుల నెంతగాఁ బ్రేమించెనో
తన సొంత ప్రాణముఁ బలిగఁబెట్టెను‖ యేసు ‖
Verse
పాపమించుకలేని కరుణా పావనుడు నరుఁడాయెను శాపగ్రస్తులమైన
మన శాపములు తాఁజేతఁ బూనెను‖ యేసు ‖
Verse
ఎన్నరాని బాధలొందుచు పుణ్యరక్తము జిందెనిలను ఎన్నఁడు నీలాటి
ప్రేమ వన్నెలేదో యన్నలారా‖ యేసు ‖
Verse
మనలఁ బాపమునుండి బాపను మనుజుఁడై మరణంబునొంది మన
ప్రభువె మూఁడవ దినంబున మహినిలేచి పరము వెళ్లెను‖ యేసు ‖

Related Tags

SalvationJesus Christ