Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Kreesthuni Golva Ranna Yee

యేసు క్రీస్తుని గొల్వ రన్న యీ

Yesu Kreesthuni Golva Ranna Yee

Lyricist: Gollapalli Nathaniel
Verse
యేసు క్రీస్తుని గొల్వ రన్న యీ జగతిలోన నెవ్వరు లేరు వాని కన్న
యేసుని వాక్యము ఎవ్వరి కబ్బునో దోసము విడి పర వాసము దొరకును‖ యేసు ‖
Verse
సత్యుఁడు నిత్యుఁడాయ నన్న యీ సర్వ సృష్టిఁ జక్కఁగ సలిపి నిలిపె
నన్న వ్యత్యాసము లే మియు లేకుండఁగ సత్యుండు చేసెను సర్వజగం
బును‖ యేసు ‖
Verse
నిరాకారుఁడు నిశ్చయుఁడన్న నరుల రక్షింప నరావతారుఁడై నాఁడన్న
నరుల పాపములుఁ పరిహరించుట కొరకై మరియ కొడుకై పుట్టెను‖ యేసు ‖
Verse
పరిశుద్ధవంతుఁ డాయ నన్న ప్రభు యేసు నందఁ పాపమే గానఁ
బడుట సున్న పరులను గావను ధరలోఁ దిరిగెను నరుల నడుమ బహు
నిరపరాధముతో‖ యేసు ‖
Verse
భేదాభేదములు గాని బోధ నాధుఁడొనరించె సాధు లెల్లను సంతోషింప
బాధలుఁబడు స ద్రిక్తులతోడను సాదర వాక్కులు జక్కగ పలికెను‖ యేసు ‖
Verse
మహిలోన మనుజు లెవ్వ రైనఁ జేయ లేనట్టి మహిమాద్బుతములఁ
జేసె నన్న మహా రోగులను మఱి మృతులను మహా మహుండు స్వస్థుల
మఱి గావించెను‖ యేసు ‖
Verse
వర్ణింప వలనుకాని వాఁడు మన కోసర మతడు మరణమై మరల
బ్రతికినాడు పరలోకమునకు మరి వేంచేసిన పరుఁ డగు క్రీస్తుని
పాదముఁ బట్టుము‖ యేసు ‖
Verse
పరిశుద్ధ దూతల నాదముతో ప్రభు యేసు క్రీస్తు ప్రకాశ వస్త్ర
మహిమలతోఁ పరమునుండి బహు త్వరగా వచ్చును ధరలో నమ్మిన
నరులను బ్రోచును‖ యేసు ‖
Verse
న్యాయంబు దీర్చు దినము గలదు నమ్మని వారెల్ల సాయంబు వెదకినను
గనపడదు సువార్త న్యాయముఁ దీర్చును నడవడి చొప్పున నమ్మని
పాపుల నరకము జేర్చును‖ యేసు ‖
Verse
నమ్మండీ నష్టము నొందక యేసుని నమ్మిన పొమ్మని చెప్పఁడు సుమ్మండి
ఇమ్ముగఁ గృపతో నిలలోఁ గాచును పిమ్మట మోక్ష పురమునఁ జేర్చును‖ యేసు ‖

Related Tags

PraiseWorshipJesus Christ