Verse
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
మనమందరము ఆయన సేవను - ఏకమై సదా జేసెదం
Chorus
మన యేసు ప్రభువు శీఘ్రముగ వచ్చును
అతివేగముగా సేవ చేతుము
యేసు క్రీస్తుని మంచి శిష్యులముగా - విశ్వాసముతో సాగెదము
Verse
అందరి యెడల ప్రేమ జూపెదం - యేసు చెంతకు పిలిచెదము
అతి శీఘ్రంబుగా ఉత్సాహంబుతో - రాజ మార్గమును చూపెదము
Verse
సాతాను దుర్గమును పదగొట్టి - ఇక యేసు కొరకే జీవింతుము
ఈ లోకమంతటన్ ప్రభు యేసు నామమున్ - ఎల్ల వేళలందు చాటెదము
Verse
ప్రాణాత్మ దేహములు ప్రభుసేవకే - ఇక జీవించుట తన కొరకే
అని నిశ్చయించుచు అందు నిలిచియుండి
ప్రభు దినమందు హర్షింతుము