Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Yesu Lechenu Aadivaaramuna Yesu Lecha

యేసు లేచెను ఆదివారమున యేసు లేచ

Yesu Lechenu Aadivaaramuna Yesu Lecha

Lyricist: Basyan Joseph
Verse
యేసు లేచెను ఆదివారమున యేసు లేచెను వేకువజామున యేసు
లేచెను‖ యేసు ‖
Verse
వేకువజామున చీఁక టుండఁగానే యాకాశదూతలు వీకతో రాఁ
గానే‖ యేసు ‖
Verse
సమాధిపై రాతిన్ స్వామి దూత లిద్దరు సమముగఁ దీయను స్వామి
లేచె నహహ‖ యేసు ‖
Verse
మృతులలో సజీవున్ వెతకు టేల నని దూతలు వారితో దాత లేఁడని
తెల్పి‖ యేసు ‖
Verse
స్త్రీలు వేగ వెళ్లి శిష్యులకుఁ దెల్ప జింత మారిపోయి సందేహము
తొల్గ‖ యేసు ‖
Verse
పేతురు యోహానుల్ పరుగెత్తుకొని వచ్చి ప్రవేశించి గుహలో పరమానంద
మొంద‖ యేసు ‖
Verse
యేసు చచ్చి లేచె యేసు శిష్యులట్లే దోసంబులకుఁ జచ్చి వాసిగ
లేతురండి‖ యేసు ‖

Related Tags

ResurrectionEaster